Jagadish Reddy: కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. చెత్త మాటలంటూ ఘాటుగా రియాక్షన్

Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి […]

Published By: HashtagU Telugu Desk
Jagadish Reddy key comments on Komatireddy Brothers

Jagadish Reddy key comments on Komatireddy Brothers

Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తులపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.కోమటిరెడ్డి పొద్దున మాట్లాడిన మాటకు సాయంత్రం మాట్లాడిన మాటకు పొంతనే ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రి ఉత్తమ్ లపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను ఆయన ఉటంకిస్తూనే ప్రజాస్వామ్యంలో ఇటువంటి చీడ పురుగులు ఉండడం దురదృష్టమన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని నా మీదనే కాదు నాకంటే మూడు తరాల ముందు వారి పై తన తరువాత తరం పై కుడా విచారణ జరిపించు కోవొచ్చన్నారు.ఏనాడు నేను దిగజారుడు మాటలు మాట్లాడలేదన్నారు.వ్యక్తిగతంగా తనపై మాట్లాడిన మాటలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

  Last Updated: 09 May 2024, 06:12 PM IST