Jagadish Reddy: ఈరోజు నల్గొండలో (Nalgonda)రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్ రావు మృతదేహానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు పై మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు అంటూ వ్యాఖ్యలు చేశారు. నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా.. అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముమ్మాటికీ బీజేపీ (BJP మనిషే అని.. బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ (Congress) మంత్రులే లీక్‌లు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
We’re now on WhatsApp. Click to Join.
నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది. అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: Vijay Devarakonda : దేవరకొండ మారిపోతున్నాడా.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు..!
కాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అద్దె ఇంట్లో ఉంటున్న జగదీష్ రెడ్డి పదేళ్లలో వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.