మునుగోడులో రాజకీయాలు చాలా హాట్ గా మారాయి. త్వరలోనే కాషాయం పార్టీలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ….మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డి నేర చరిత్ర మొత్తం నాదగ్గర ఉంది..బినామీల పేరుతో ఆయన సంపాదించిన వేల కోట్ల అక్రమాస్తుల చిట్టా ఉంది…అవన్నీ బయటపెడతా అన్నారు. గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర జగదీశ్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన రుజువులు తన వద్ద ఉన్నాయన్నారు. టీఆరెస్ సర్కార్ రాకముందు జగదీశ్ రెడ్డికి ఆస్తులెన్ని…ఇఫ్పుడు ఇప్పుడున్న ఆస్తులెన్ని అంటూ ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి.
2009 తర్వాత తన ఆస్తులను తాను అమ్ముకున్నాని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కాంట్రాక్టుల కోసం తాను అమ్ముడుపోయానని జగదీశ్ రెడ్డి ఆరోపించారని మండిపడ్డారు. ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించినట్లయితే మనుగోడు ఉపఎన్నికలో తాను పోటీ చేయనన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. లేదంటే జగదీశ్ రెడ్డి నేర చరిత్ర , అక్రమాస్తులను తాను రుజువు చేస్తే…ఆయన రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.