KCR : కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు బిజెపి ప్లాన్ – జగదీష్ రెడ్డి

కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 11:09 PM IST

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ vs బిఆర్ఎస్ వార్ నడుస్తుంది. కేసీఆర్ తొందరపాటు వల్ల ఈరోజు రాష్ట్రం విద్యుత్తు విషయంలో అప్పులపాలైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే..బిఆర్ఎస్ మాత్రం బిఆర్ఎస్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదందని, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ..బిఆర్ఎస్ ఫై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తుంది. ఈ తరుణంలో ఈరోజు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి..కాంగ్రెస్ ఫై విమర్శలు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అన్నారు. ”ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు, ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి. కమిషన్‌కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదు. దురదృష్టవశాత్తూ కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయట పెట్టింది. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు. కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి… రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందంతో రూ. 6000 కోట్ల నష్టం కాదు.. అంతకు మించి లాభం జరిగింది. లీకులను సమర్థించేలా కొందరితో ఈ రోజు మాట్లాడించారు. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని ఛత్తీస్‌ఘడ్‌కు రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది?. ఛత్తీస్‌ఘడ్‌కు సరిపడా విద్యుత్ ఇవ్వకపోవడంతో ఎక్కువ ధరకు కొన్నారు. నష్టం జరిగిందని ఇప్పుడు అంటున్నారు. మరి ఛత్తీస్‌గడ్ ఒప్పందం లేకపోతే 17 వేల మిలియన్ యూనిట్లకు 17 వేల కోట్లు కట్టాల్సి వచ్చేది” అని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు. అవినీతి జరిగి ఉంటే అప్పటి సీఎం రమణ్​ సింగ్​, కాంగ్రెస్​ సీఎంలు డబ్బులు ఇచ్చారా అని ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో విద్యుత్​ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదానని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆచార్య కోదండరాం దొంగలతో చేతులు కలిపి ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read Also : Emeya EV Car: త్వరలోనే మార్కెట్ లోకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కార్.. లాంచ్ అయ్యేది అప్పుడే!