అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల మధ్యకు వచ్చి హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే చిరుతల తాకిడి ఎక్కువైందని అనుకుంటే..ఇప్పుడు గుంట నక్కలు కూడా గ్రామాల్లోకి వచ్చి ప్రజలపై దాడికి దిగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం (Mustabad mandal) మద్దికుంటలో ఒక గుంటనక్క (Jackal ) మహిళపై దాడి (Attack) చేసింది. ఈ సంఘటన గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసింది. గతంలో పులులు, చిరుతలు, ఎలుగుబంటులు దాడి చేసినట్లు చూశాము, కానీ ఇదే తొలిసారి ఒక గుంటనక్క ప్రజలపై దాడి చేసిన ఘటన అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్
గ్రామానికి చెందిన సూత్రం రాధ (34) (Sutrapur Radha) అనే మహిళ ఉదయం ఐదున్నర గంటలకు వాకిలి ఊడుస్తుండగా, ఎక్కడి నుంచి వచ్చినదో తెలియకుండా ఒక గుంటనక్క ఆమెపై దాడి చేసింది. మొదట కుక్క అనుకుని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా, ఆ నక్క మళ్ళీ ఆమెపై దాడి చేసింది. దాడిలో రాధ ముఖం మరియు మెడపై గాయాలు పడ్డాయి. రాధ అరుపులు విన్న స్థానికులు స్పందించి, నక్కను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా, వారు కూడా దాడికి గురయ్యారు. పెద్ద పెద్ద కట్టెలతో బెదిరించడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆరు గంటలకు నక్క మళ్ళీ అదే గ్రామంలో మరో వ్యక్తి కాలిని కరిచింది. ఈ వ్యక్తి కూడా కట్టెతో నక్కను కొట్టి దూరం పంపించాడు. నక్క దాడిలో గాయపడిన రాధను హుటాహుటిన ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కావటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామస్తులు వణికిపోతున్నారు. రాధ ఇటీవలే నడుము గాయంతో కోలుకుంటున్న ఆమె ఈ దాడికి గురైంది. దీంతో స్థానికులు ఆమెకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.