JAC Leader Motilal Naik : దీక్ష విరమించిన మోతీలాల్‌ నాయక్‌

తొమ్మిదిరోజులుగా గాంధీ హాస్పటల్ లో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగుల కోరికమేరకు కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించారు

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 11:42 AM IST

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మోతీలాల్‌నాయక్‌ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ హాస్పటల్ లో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగుల కోరికమేరకు కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించారు. తనకు మద్ధతు తెలిపిన వారందరికీ పేరుపేరుగా ధన్యవాదాలు తెలిపారు.

దీక్ష విరమణ అనంతరం మోతీలాల్‌ (JAC Leader Motilal Naik) మాట్లాడుతూ.. నిరుద్యుగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నానట్లు మోతిలాల్ వెల్లడించారు. తొమ్మిది రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తూ వచ్చానని, నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని, కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్‌ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తాం. అన్ని పార్టీల వారినీ కలుపుకుని పోతాం. నాకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ నాయకులందరికీ కృతజ్ఞతలు. మీడియా, సోషల్‌ మీడియాకు ధన్యవాదాలు’ తెలిపారు.

గ్రూపు1 1:100 శాతం చేయాలని మోతీలాల్ డిమాండ్ చేశారు. గ్రూపు 2, గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలన్నారు. డీఎస్సీ రద్దుచేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. బుధవారం నుంచి ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. 50 వేలు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు జారీచేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Read Also : Majority Population : ఇలాగే జరిగితే.. మెజారిటీ ప్రజలు మైనారిటీలు అవుతారు : హైకోర్టు