YS Sharmila Gift: కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్దుకునే టైం వచ్చింది: వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకొని పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 02:05 PM IST

YS Sharmila: 2023 అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ బీఆర్ఎస్, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు అన్నట్టుగా సాగాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ విజయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి ఈ ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకొని అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దని ఉద్దేశంతోనే ఆమె పోటీకి దూరంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.

అయితే మొదట్నుంచి కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల తాజాగా మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్ గా పంపించారు. ‘‘కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్ధుకునే టైం వచ్చింది. కేసీఆర్ గారు ప్యాక్ అప్ చేసుకోండి. బైబై కేసీఆర్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు.

తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా YSRTP పనిచేసిందని, కేసీఆర్‌ పాలన అంతం కావాలనే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని షర్మిల ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

Also Read: Chandrababu: కనకదుర్గమ్మ సేవలో చంద్రబాబు, సతీసమేతంగా పూజలు!