Govt Doctors : ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తే ఇంటికే..!

వైద్య రంగాన్ని ప్ర‌క్షాళ‌న చేసే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Updated On - June 7, 2022 / 05:18 PM IST

వైద్య రంగాన్ని ప్ర‌క్షాళ‌న చేసే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ప‌నిచేయ‌డానికి లేద‌ని తేల్చేసింది. ఆ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఒక వేళ ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో పనిచేసిన‌ట్టు గుర్తిస్తే స‌ర్వీసు నుంచి తొలగించ‌డంతో పాటు సీనియార్టీని త‌గ్గించేలా రూల్స్ ఫ్రేమ్ చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం అయింది.

తొలిసారి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అప్ప‌ట్లో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రూ ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేయ‌డానికి లేద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దానిపై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు రావ‌డంతో పాటు విప‌క్షాలు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ త‌రువాత. ప‌లువురు సీఎంలు ఆ విధానాన్ని అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసినప్ప‌టికీ వైఫ‌ల్యం చెందారు. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాహ‌సంతో. కూడిన నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వ వైద్యులు, లెక్చ‌రర్ల‌తో పాటు ఉద్యోగులు ఎవ‌రూ ప్రైవేటు సంస్థ‌ల్లో సేవ‌లు చేయ‌డానికి లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయ‌డానికి లేద‌ని తేల్చేసింది. అంతేకాదు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన వ‌స‌తుల‌తో పాటు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స‌న్న‌ద్ధం అయింది. వందలాది మంది వైద్యుల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నియమించ‌డానికి నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఆ క్ర‌మంలో ప్ర‌భుత్వ వైద్యుల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆంక్ష‌లు పెట్టింది.