Bandi Sanjay Emotional: పోలీసులకు ‘బలగం’ సినిమా చూపెడితే బాగుండేది: భార్యతో బండి సంజయ్‌!

బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. భార్యతో తన బాధను చెప్పుకున్నారు.  

Published By: HashtagU Telugu Desk
Bandi Sanjay watched Balagam movie at RTC Cross Roads

Bandi

టెన్త్ (Tenth) పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ను  కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ ను నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుటుంబ సభ్యులు పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. భార్యతో తన బాధను చెప్పుకున్నారు.

పోలీసులకు ఇటీవల విడుదలైన ‘బలగం’ (Balagam) సినిమా చూపెడితే బాగుండేదని.. అలాగైనా వారికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ అర్థమయ్యేవని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) అనట్టు ఆయన సతీమణి చెప్పారు. కరీంనగర్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా సంజయ్‌ను గురువారం ములాఖాత్‌లో ఆమె కలిశారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆరెస్ట్ చేయడం పట్ల బాధ పడటం లేదని అరెస్టు చేసిన సందర్భమే బాగాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

కాగా పేపర్ లీకేజీ(Paper leakage)కి పాల్పడుతూ విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌వీ(Brsv) విభాగం విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామం పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల బండి సంజయ్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు బీఆర్ఎస్ నాయకులు.

Also Read: Cable Bridge: ట్రాఫిక్ అలర్ట్.. కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో నో ఎంట్రీ

  Last Updated: 06 Apr 2023, 04:38 PM IST