Site icon HashtagU Telugu

Ponnala – BRS : కారెక్కనున్న పొన్నాల ? ఆయన కామెంట్స్ లో అంతరార్ధం అదే ?

Ponnala Lakshmaiah complaint to Rahul Gandhi Regarding Janagaon DCC President

Ponnala Lakshmaiah complaint to Rahul Gandhi Regarding Janagaon DCC President

Ponnala – BRS : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. పీసీసీ మాజీ చీఫ్, పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. జనగామ సీటు విషయంలో తనను పక్కన పెట్టడంపై ఆగ్రహంతోనే కాంగ్రెస్ ను వీడాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి పొన్నాలకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరిక విషయమై పొన్నాలతో ఇప్పటికే ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు చర్చలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు పొన్నాలతో గురువారం రాత్రి దాసోజు శ్రవణ్ కూడా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

పొన్నాల కామెంట్స్ దేనికి సంకేతం ?

‘‘బీసీల‌కు బీఆర్ఎస్ లో ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, పార్టీ ప‌ద‌వులు ఇస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం బీసీల‌కు గుర్తింపు దక్కడం లేదు. బీసీలకు అన్యాయం జరుగుతోందనే కాంగ్రెస్ కు రాజీనామా చేశాను. బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చే పార్టీతో ఉండలేను. బీసీలకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన పయనమెటు అనేది తేలిపోయింది. పొన్నాల తదుపరి అడుగు గులాబీ పార్టీ వైపే అని రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే జనగామ సీటును పల్లా రాజేశ్వరరెడ్డికి బీఆర్ఎస్ కేటాయించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి దౌత్యంతోనే పొన్నాల బీఆర్ఎస్ లోకి వస్తున్నారనే టాక్ కూడా ఉంది. పల్లాకు, పొన్నాల తోడైతే జనగామలో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీలో ముఖ్య పదవి లేదా ఎమ్మెల్సీ లేదా ఇంకేదైనా హామీతో పొన్నాలను కారు పార్టీలోకి తీసుకుంటున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల జాబితాను ప్రకటించిన తరువాత.. ఆ పార్టీ నుంచి ఇంకా కొందరు కీలక నేతలు కూడా ఇదే విధంగా కారెక్కే అవకాశాలు ఉన్నాయని (Ponnala – BRS)  చెబుతున్నారు.

Also Read: Bandla Ganesh : భోళా మనిషి పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్