Vivek Venkat Swamy : కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌పై ఐటీ రైడ్స్

Vivek Venkat Swamy : మంచిర్యాలలోని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 21, 2023 / 10:48 AM IST

Vivek Venkat Swamy : మంచిర్యాలలోని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచే తనిఖీలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి రాకుండా అడ్డుకొని.. వివేక్ నివాసాన్ని ఐటీ అధికారులు రైడ్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు సోమాజిగూడలోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివేక్‌ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.  వాస్తవానికి సోమవారం రాత్రి నుంచే మంచిర్యాలలోని మాజీ ఎంపీ వివేక్ అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు మొదలయ్యాయి. వివేక్‌ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్లను ఈనెల 15న అధికారులు ఫ్రీజ్‌ చేశారు. ఆ 8 కోట్లతో ముడిపడిన లావాదేవీల వివరాలను సేకరించేందుకే ఇవాళ ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఈవిధంగా ఐటీ రైడ్స్ చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో వివేక్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈ ఐటీ రైడ్స్ చేయిస్తున్నారని  ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 15న వివేక్‌కు చెందిన ఓ కంపెనీలో పనిచేసే పలువురు ఉద్యోగులు చెన్నూరుకు రూ.50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్‌‌లోని రామంతాపూర్‌లో పట్టుబడ్డారు. వివేక్‌ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్ల నగదును కూడా ఆ రోజు అధికారులు ఫ్రీజ్‌ చేశారు. ఈ నెల 13న ఉదయం 10.57 గంటలకు బేగంపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లోని విశాఖ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఒక ఖాతా నుంచి బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాలోకి (ఖాతా నంబర్‌ 0142003072600) రూ.8 కోట్ల నగదు బదిలీ అయినట్టు ఎన్నికల అధికారులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఆదేశాలతో ఆ ఖాతాలో జమైన అనుమానాస్పద రూ.8 కోట్ల నగదును బ్యాంకు అధికారులు ఫ్రీజ్‌ చేశారు.

Also Read: Australian Players: ఐపీఎల్ వేలంలో ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కాసుల వర్షం ఖాయం..?

వివేక్ వెంకటస్వామి రాజకీయ జీవితం తొలుత కాంగ్రెస్‌లోనే మొదలైంది. అనంతరం ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అక్కడ సముచిత స్థానం దక్కకపోవడంతో బీజేపీ‌లో చేరారు. అక్కడ కూడా తగిన ప్రయారిటీ లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.  మళ్లీ పార్టీలో చేరగానే.. ఆయనకు చెన్నూరు కాంగ్రెస్ టికెట్ కన్ఫార్మ్(Vivek Venkat Swamy) అయింది.