ED Raids : రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ రైడ్స్ నిర్వహిస్తోంది. ఈడీ అధికారులతో(ED Raids) కలిసి ఐటీ ఆఫీసర్లు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు నాలుగు టీమ్‌లుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారని తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ జారీ చేరిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం విచారణ చేపట్టింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపించారు. అప్పట్లో కవిత పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. అయితే పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు ఇటీవల గత విచారణలో జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.వాస్తవానికి కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో గతంలో కవితకు రెండు సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు మూడు రోజులు విచారించారు. జనవరి 16న విచారణకు రావాలని కవితను ఈడీ కోరగా..సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున హాజరుకాలేనని ఆమె లేఖ రాశారు.