Site icon HashtagU Telugu

IT Raids : హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఈసారి టార్గెట్ ఎవరంటే ?

IT Raids

It Raids Hyderabad

IT Raids : అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వరకు ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు.. తాజాగా శనివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులను లక్ష్యంగా ఎంచుకుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో వీరు నగరంలో పెద్దసంఖ్యలో ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల నుంచి ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుతున్నాయనే సమాచారం అందడంతో ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో కూడా కోహినూర్‌ గ్రూప్‌ ఎండీ ఇండ్లు, కార్యాలయాలతో పాటు గ్రూప్‌లోని పలు హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఓల్డ్‌సిటీ, దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్‌ గ్రూప్‌కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ -22లో మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకే గోయల్‌ ఇంట్లోనూ ఎలక్షన్స్‌ స్క్వాడ్‌, టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు డంప్‌ అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు సమాచారం అందడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో గోయల్‌ ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇటీవల ఐటీ రైడ్స్‌ను ఎదుర్కొన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహ్మా రెడ్డి, కేఎల్ఆర్, మంత్రి సబిత, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, గడ్డం వినోద్, వివేక్  తదితరులు ఉన్నారు.

Also Read: Rythu Bandhu : ‘రైతుబంధు’పై ఎన్నికల ఎఫెక్ట్.. నగదు పంపిణీ తేదీ ఇదీ