IT Rides : తెలంగాణ లో ఐటీ దాడులు..కాంగ్రెస్ నేతలే టార్గెట్..?

బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలోను సోదాలు జరుగుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
It Rides On Congres Leaders

It Rides On Congres Leaders

తెలంగాణ ఎన్నికల వేళ (Telangana Elections Time) హైదరాబాద్ లో ఐటీ దాడులు (IT rides) కలకలం సృష్టిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే హైదరాబాద్‌ నగరంలోని బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి(Parijata Narasimha Reddy)ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (Kichannagari Lakshma Reddy) నివాసంలోను సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మాధాపూర్ లోని ఆఫీసుతోపాటు కోకాపేటలోని NCC అర్బన్ అపార్ట్‌మెంట్‌లోని ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి. ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. కేఎల్ఆర్ వియ్యంకుడు రాజేందర్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేశ్వరంలో కేఎల్‌ఆర్‌ గెలుపు ఖాయమన్న భయంతోనే ఆయన్ని టార్గెట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడుల వెనక బీజేపీ, బీఆర్ఎస్‌ ఉన్నాయని ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ చార్జి మాణిక్‌రావు ఠాక్రే.

Read Also : Pawan Kalyan : వరుణ్ కు పవన్ కళ్యాణ్ పెళ్లి కానుక ఏమిచ్చాడో తెలుసా..?

  Last Updated: 02 Nov 2023, 12:13 PM IST