ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ రైడ్స్ (IT Rides) జరగడం తో అన్ని రాజకీయ పార్టీలలో చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే (Congress Leaders ) టార్గెట్ అన్నట్లు రెండు రోజులుగా వారి ఇళ్లలో , ఆఫీస్ లలో సోదాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. లక్ష్మారెడ్డి ఫామ్‌హౌస్, ఇతర నేతల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగాయి.
ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి (Janareddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి (Raghuveera Reddy ) వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మొత్తం 18 చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక మాదాపూర్‌లోని కేఎల్‌ఆర్ (KLR)హెడ్ క్వార్టర్స్‌లోనూ తనిఖీలు చేశారు. అక్కడి నుంచి కీలక స్టేట్‌మెంట్లను ఐటీ స్వాధీనం చేసుకుంది. ఈరోజు సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చిగురింత పారిజాతను తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బడంగ్‌పేట్‌కు తరలించారు.నవంబర్ 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి అధాయపన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 18 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తోడల్లుడు గిరిధర్ రెడ్డి (Giridhar Reddy)నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కొన్ని గంటలుగా వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. తుక్కుగూడలో కేఎల్ఆర్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐడీ దాడులపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరంలో సబితారెడ్డి ఓడిపోతున్నారని భయపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్ సహకారంతో తమ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు చేయించారని ఆరోపించారు.
Read Also : First Nomination : అసెంబ్లీ పోల్స్‌లో తొలి నామినేషన్ ఆయనదే