Site icon HashtagU Telugu

IT Raids : రామగుండంలో 2 కోట్లు సీజ్.. నారాయణపేట ఎమ్మెల్యే అనుచరులపై ఐటీ రైడ్స్

IT Raids

It Raids Hyderabad

IT Raids : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపించిన తరుణంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పలువురు అభ్యర్థులు టార్గెట్‌గా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లాలో ఐటీ ఆఫీసర్లు సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి  ముఖ్య అనుచరుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఒక డిగ్రీ కళాశాలలో గతంలో ప్రిన్సిపల్‌గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి, బంగారం వ్యాపారి హరినారాయణ భట్టాడ్, వ్యాపారి బన్సీలాల్ లహోటి నివాసాల్లో రైడ్స్ చేస్తున్నారు.

  • పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో దాచి పెట్టిన భారీ నగదును అధికారులు పట్టుకున్నారు. రూ.2.18 కోట్లు లభ్యమయ్యాయని తెలుస్తోంది.
  • ఇవాళ తెల్లవారుజామున ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఇంట్లో ఐటీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలంపూర్‌లోని శాంతి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలోకి దూసుకెళ్లిన అధికారులు మొత్తం ఇంటిని జల్లెడపట్టారు. ఎంత తనిఖీ చేసినా పోలీసులకు ఎలాంటి డబ్బులు, వస్తువులు దొరకలేదు. ఈ రైడ్స్ నేపథ్యంలో ఆందోళనకు గురైన సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి‌కి అస్వస్థతకు గురయ్యారు. సృహ తప్పి పడిపోయిన సంపత్ కుమార్ భార్యను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. దీంతో అలంపూర్ లో ఉద్రిక్తత ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఐటీ రైడ్స్‌ను ఎదుర్కొన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహ్మా రెడ్డి, కేఎల్ఆర్, మంత్రి సబిత, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, గడ్డం వినోద్, వివేక్  తదితరులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ -22లో మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకే గోయల్‌ ఇంట్లోనూ ఎలక్షన్స్‌ స్క్వాడ్‌, టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు డంప్‌ అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు సమాచారం అందడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో గోయల్‌ ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు(IT Raids) నిర్వహించారు.

Also Read: Day 16 – 41 Workers : మరో నాలుగైదు రోజులు సొరంగంలోనే 41 మంది కార్మికులు

Exit mobile version