IT Raids: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్

లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.

Published By: HashtagU Telugu Desk
It Raids

It Raids

IT Raids: లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లోని బీజేపీ నేత శ్రీరాములు యాదవ్‌ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు పీఏ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరాములు యాదవ్‌ ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సామంత్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లో అణువనువూ తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత ఇంట్లో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 18 Feb 2024, 05:00 PM IST