Site icon HashtagU Telugu

IT Rides : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు లభ్యం

Rohit

Rohit

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Poll ) వేళ ఐటీ రైడ్స్ రాజకీయనేతలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నేతల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇళ్లలో , ఆఫీస్ లలో దాడులు జరిపిన అధికారులు..తాజాగా శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని (Tandur) రోహిత్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సోదరుడు రితీష్ రెడ్డి దగ్గర రూ.24 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు, హైదరాబాద్ పాతబస్తీలోని పలు వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు సమకూరుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.

Read Also : Telangana polls: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, తెలంగాణలో 684.66 కోట్లు సీజ్!