KTR Reaction: TSPSC లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు: కేటీఆర్

TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు.

  • Written By:
  • Updated On - March 19, 2023 / 11:15 AM IST

తెలంగాణ రాష్ట్రాన్ని TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహరం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అటు నిరుద్యోగులు, ఇటు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. TSPSC కారణంగా ఓ నిరుద్యోగ యువకుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తో కలిసి మీడియా ముందుకొచ్చారు. TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. కేవలం ఇద్దరు వ్యక్తుల వల్ల తప్పిదాలే వ్యవస్థకు చెడ్డ పేరొచ్చిందనీ, మళ్లీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనీ కేటీఆర్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిసన్ అనే రాజ్యాంగబద్దమైనదనీ, ప్రభుత్వానికి కమిషన్ పై ఎలాంటి హక్కు ఉండదనీ, ప్రభుత్వం పాత్ర అసలే ఉండదనీ కేటీఆర్ అన్నారు.

ఈ లీకేజ్ వ్యవహరాన్ని మొత్తం సీఎం కేసీఆర్ కు నివేదించామని, ఆయన ఆదేశాల మేరకు తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు పరీక్షలకు అప్లయ్ చేసుకున్న అభ్యర్తులు మళ్లీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని, నిరుద్యోగులు, విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహరంలో పట్టుబడిన రాజశేఖర్ రెడ్డి వ్యక్తి బీజేపీతో సంబంధాలున్నాయని, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు కేటీఆర్ తేల్చి చెప్పారు.

రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా.. ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. TSPSC పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ (Bandi Sanjay)అని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ శాఖ కాదని.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. దీనిపై బండి సంజయ్‌‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.