KTR Big Post? నేషనల్ పాలిటిక్స్ లోకి కేసీఆర్.. కేటీఆర్ కు బిగ్ ప్రమోషన్!

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దాదాపుగా అడుగుపెట్టబోతున్నారు.

  • Written By:
  • Updated On - October 4, 2022 / 10:07 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దాదాపుగా అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి దసరా పండుగ సందర్భంగా పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ కార్యక్రమాలు జరుగుతాయి. పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారు. కేసీఆర్ గైర్హాజరీలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన స్థానంలో తెలంగాణ అధికార పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కీలక శాఖలతో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూడా కేటీఆర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కీలకమైన పదవి. సీఎం కేసీఆర్ తర్వాతి స్థానం. ఇంతకుముందు, కొంతమంది కేబినెట్ మంత్రులు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని బహిరంగంగా చెప్పారు. ఐటీ మంత్రికి పెద్ద ప్రమోషన్ వస్తే.. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి టీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే అప్పట్లో, కేసీఆర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అలాంటి కామెంట్స్ చేయొద్దని సీరియఎస్ అయ్యారు.

అంతే కాదు అనవసర సమస్యలు సృష్టించవద్దని శాసనసభ్యులు, మంత్రులను కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడంతో కేటీఆర్ అదృష్టం వరించి తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. జాతీయ పార్టీ కేసీఆర్‌ని జాతీయ రాజకీయాల్లోకి నెట్టి ఆయన కుమారుడిని తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధినేతను చేసే అవకాశం ఉంది. కేసీఆర్ తన మైలేజీని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఆయన భావసారూప్యత కలిగిన నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలవవచ్చు. గతంలోనూ కొందరు ముఖ్యమంత్రులను కలిసిన ఆయన ఇప్పుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.