Site icon HashtagU Telugu

KTR: కేటీఆర్ ‘అమెరికా యాత్ర’

Ktr

Ktr

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే ఎన్నో ఐటీ, విదేశీ సంస్థలు హైదరాబాద్ వేదికగా తమ సంస్థలను రన్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలంగా మారడం, కావాల్సిన వనరులు అందుబాటులో ఉండటంతో విదేశీ సంస్థలు క్యూ కడుతున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో పలు సంస్థలు ఈ ప్రాంతవైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ మరో పర్యటనకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ సంస్థలను ఆహ్వానించేందుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికా వెళ్లింది. హైదరాబాద్ అమెరికా బయల్దేరిన తెలంగాణ ప్రతినిధి బృందం లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో, శాన్ జోస్, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనుంది. పెట్టబడుల లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ ఈ వారం రోజుల పర్యటనలో పూర్తి ఎజెండాతో సిద్దమయ్యారు. USలోని అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లను కలవనున్నారు. రాష్ట్ర ప్రగతిశీల విధానాలు, పరిశ్రమలకు అనుకూలమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కరంపురి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ గవార్‌, ప్రమోషన్స్‌ డైరెక్టర్‌ విజయ్‌ రంగినేని, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు కేటీఆర్ వెంట ఉన్నారు.