Site icon HashtagU Telugu

Duddilla Sridhar Babu: ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu: తెలంగాణ నూతన కాబినెట్ రూపుదిద్దుకోగా ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కొడుకే శ్రీధర్ బాబు. 1969లో ధన్వాడ గ్రామంలో జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1998లో ఏపీ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే శ్రీధర్ బాబు జీవితంలో 1999 సంవత్సరంలో అనుకోని చేదు సంఘటన ఒకటి ఎదురైంది. 1999లో మావోయిస్టులు తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావును కాల్చి చంపారు. దీంతో శ్రీధర్ బాబు రాజకీయ రంగప్రవేశం చేశారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2004లో మంథని నుంచి గెలిచిన తర్వాత ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం విప్ గా ఎన్నికయ్యారు. 2009, 2018లో ఇప్పుడు 2023లోనూ శ్రీధర్ బాబు వరుసగా మంథని నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. శ్రీధర్ బాబుకి మంత్రిగా చేసిన అనుభవం ఉంది. 2010లో పౌర సరఫరాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్‌గా పనిచేసిన దుద్దిళ్ళ.. 2023లోనూ ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనంలోకి వెళ్ళడానికి ఈ మేనిఫెస్టోయే బాగా ఉపయోగపడింది.

Also Read: 2023 Retired Cricketers: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఆటగాళ్లు వీళ్ళే..