Site icon HashtagU Telugu

CM KCR: 2024లో కేంద్రంలో అధికారం మనదే…!!

Cm Kcr

Cm Kcr

2024లో కేంద్రంలో అధికారంలో మన ప్రభుత్వం ఉంటుందని జ్యోస్యం చెప్పారు తెలంగాణ సీఎం చెప్పారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎల్లమ్మగుట్టలోని కొత్తగా నిర్మించిన టీఆరెఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనెందుకు మధ్యాహ్నం హెలికాఫ్టర్లో నిజామాబాద్ కు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గానా వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిజాబామాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. 2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. దేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మాదిరి వలే 24ఉచిత కరెంటును దేశమంతా ఇస్తామన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ కూడా ప్రవేస్తుందని కీలక ప్రకటన చేశారు కేసీఆర్.

 

Exit mobile version