KTR : ప్రభుత్వ భూములను ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖా పెడతారా ? : కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

Published By: HashtagU Telugu Desk
Revanth R-Tax

KTR : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. నిధుల సమీకరణ కోసం సీఎం రేవంత్ సర్కారు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంటోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలనాపరంగా నడపడం రేవంత్ సర్కార్‌కు చేతకావడం లేదన్నారు. ఈమేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ ఓ పోస్ట్ చేశారు. ‘‘తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20వేల కోట్లు విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లను సమీకరించాలనే ఆలోచనే కరెక్టు కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ లోన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించే ఒక మర్చంట్ బ్యాంకర్‌‌కు రు.100 కోట్లు కమీషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సర్కారు సిద్ధమైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ ప్రగతి కుంటుపడుతుందన్నారు.  కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కరువయ్యే అవకాశం ఉందని కేటీఆర్(KTR) ఆందోళన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు వస్తున్న కోకాపేట, రాయదుర్గం వంటి విలువైన ప్రాంతాల్లో 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి గత ఏడు నెలలుగా తెలంగాణలో పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందన్నారు. కొత్తగా పెట్టుబడులు రావడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు సరైన ప్రోత్సాహానికి నోచుకోక ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు  పక్కచూపులు చూస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములను తాకట్టు పెట్టడం సరికాదన్నారు.

Also Read :IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్

  Last Updated: 10 Jul 2024, 02:05 PM IST