KTR: ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు, పార్టీ నేతలకు కేటీఆర్ హితబోధ

KTR: తమను వోడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన ద్రుష్టికి వచ్చిందని, అట్లా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హితవు పలికారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి […]

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

KTR: తమను వోడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన ద్రుష్టికి వచ్చిందని, అట్లా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హితవు పలికారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

బిఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూయించారు. ఎందుకిట్లా జరిగిందో విశ్లేషించుకుందాం. కొంతమంది చేయిగుర్తుకు వేసిన పెద్దమనుషులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసింది. ఖశ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచింది.119 సీట్లల్లొ 39 గెలిచినం అంటే మూడోవంతు గెలిచినం. మిగతా 14 స్తానాల్లో కేవలం వందల్లో వేలల్లో వోడినం. అవికూడా గెలిచివుంటే పరిస్థితి వేరుగా వుండేది.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు

• గడచిన గత పది పార్లమెంటరీ రివ్యూల్లో మనం వోడిపోవడానికి గుర్తించిన ప్రధానంగా కారణాలు
1. పరిపాలన మీద ద్రుష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.ఇందుకు పూర్తి బాద్యత నాదే
2. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గాజరగలేదు. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయాం. దీనికీ పూర్తిబాధ్యత నాదే.
3. నియోజవర్గాల్లో ఎమమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడంసరికాదు.
4. ఈ పదేండ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు.
5. ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల వోటరుకు కార్యకర్తకు లింకు తెగింది.
6. రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలోతీస్కపోలేక పోయాం.
7. పెన్షన్లు కూడా కొత్తవి ప్రతినియోజవర్గంలో 15 వేలకు వరకు కొత్తగా ఇచ్చినాం …దాన్నీ జనంలోకి తీస్కపోలేదు. వందలో వొక్కరికి రాకుంటే అదే నెగెటివ్ గా ప్రచారమైంది.
8. దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు వోపికపట్ట లేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారు. ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత కానవచ్చింది.
9. రైతుబందు తీసుకున్న సామాన్య రైతుకూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే వొప్పుకోలేదు
వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలున్నాయని తెలిపారు. కాగా…అమలు చేసిన పథకాల ద్వారా భవిష్యత్తులో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనావేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలలో తేలిందని కేటీఆర్ వివరించారు.
10 • రోజువారిగా జరుగుతున్న సమీక్షాలో వెల్లడౌతున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నివేదిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు.

  Last Updated: 12 Jan 2024, 03:10 PM IST