బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖపేర్కొంది. గడిచిన మూడుగంటల్లో వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. కళింగపట్నం దక్షిణ-ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక.. తెలంగాణ లో శుక్రవారం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచే ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మూడు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రయాణాలు కూడా మానుకుంటే మంచిదని సూచిస్తున్నారు. రానున్న 48 గంటల పాటు తెలంగాణలో 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఇక దేశంలో సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 167మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొంది.
Read Also : Blood Test : ఈ రక్త పరీక్ష 1 గంటలో మెదడు క్యాన్సర్‌ను గుర్తిస్తుంది..!