TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 06:43 PM IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు ఐటీ అధికారులు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు చామకూర భద్రారెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదుగంటపాలు వీరిని విచారించిన ఐటీ అధికారులు పలు అంశాలను స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు ,ఫీజు వసూలు పై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం.

కాగా ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానం చెప్పామని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారన్నారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించినట్లు ఆయన చెప్పారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారన్న రాజశేఖర్ రెడ్డి…. మేము చెప్పిన సమాధానాలతో ఐటి అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని మేము భావిస్తున్నామన్నారు. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారు.

ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తెలిపారు. తమతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని విచారించినట్లు ఆయన చెప్పారు.
మా స్టేట్మెంట్లతో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేశారన్నారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలని చెప్పారు. అధికారులు అడిగిన ఫార్మేట్ లో మేము పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని భావిస్తున్నామన్నారు. ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి ,మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు ఇవ్వలేదని తెలిపారు. త్వరలో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని ఐటీ అధికారుల తెలిపారు