దువ్వాడ దంపతులు శ్రీనివాస్, మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు పార్టీ కల్చర్‌కు వేదికగా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, సరైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహించడం సాధారణమైపోయింది. ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ పార్టీలను భగ్నం చేస్తున్నారు. తాజాగా మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పార్టీని నిర్వహించారు.
పార్టీకి సంబంధించిన లీకైన వీడియోలు, మరియు మాధురి పుట్టినరోజు వేడుకలకు సంబంధించినట్టుగా బయటపడిన ఇన్విటేషన్ కార్డులు టీవీ స్క్రీన్లపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో కోణంలో ఈ జంటను విమర్శిస్తూ, కథనాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ మొత్తం రచ్చపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట తమదైన శైలిలో స్పందించారు. తాము పూర్తిగా నిరపరాధులమని, ఈ పార్టీకి సంబంధం లేదని, ‘సుద్దపూసలం, మమ్మల్ని నమ్మండి’ అంటూ మీడియా కు చెపుతూ ఈ పార్టీ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు చెపుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు ఇప్పటికీ అధికారికంగా స్పందించకపోవడం, తమను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్లుగా మౌనం వహించడం ఈ గందరగోళాన్ని మరింత పెంచింది.
Interest Rates : గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన SBI
ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగిన మాట వాస్తవమేనని, తాము కూడా అక్కడకు వెళ్ళింది నిజమేనని దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంగీకరించారు. అయితే మీడియా ఊహించినట్లుగా అక్కడ అభ్యంతరకరమైన సంఘటనలేవీ జరగలేదని వారు వివరణ ఇస్తున్నారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ పార్థూ ఆహ్వానం మేరకు తాము పార్టీకి వెళ్ళామని, తాము వెళ్ళిన కేవలం 15 నిమిషాల్లోనే పోలీసులు ఫామ్‌హౌస్‌కు వచ్చారని తెలిపారు. పార్టీకి అవసరమైన అనుమతులు లేవని పోలీసులు చెప్పినప్పుడు మాత్రమే ఆ విషయం తమకు తెలిసిందని, అప్పటివరకూ తమకు తెలియదని అన్నారు. పార్టీలో అప్పటికే సుమారు 25 మంది, వారిలో కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారని, మద్యం సేవిస్తున్న వారిని చూశామని, కానీ తాము మద్యం, హుక్కా తీసుకోలేదని ఈ జంట స్పష్టం చేసింది. అంతేకాక, తమను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని, కనీసం ఎఫ్‌ఐఆర్ (FIR) లో కూడా తమ పేరు లేదంటూ మీడియాకు వివరంగా క్లారిటీ ఇచ్చారు.
దువ్వాడ జంట తమ వివరణ ఇస్తుండగానే, మీడియాలో మాధురి పుట్టినరోజుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు మరింత వివాదాన్ని రాజేసింది. డిసెంబర్ 12వ తేదీ మాధురి పుట్టినరోజు కావడంతో, అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ఈ ఫామ్‌హౌస్ పార్టీ మాధురి బర్త్‌డే వేడుకల కోసమే ఏర్పాటు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనుమతులు లేకుండా, ముఖ్యంగా విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) మరియు హుక్కా సరఫరా చేశారంటూ కథనాలు వచ్చాయి. బర్త్‌డే ముందు రోజు రాత్రి పార్టీకి హాజరై, అర్ధరాత్రి 12 గంటలు దాటగానే అక్కడే కేక్ కట్ చేసి, వేడుకలు వైభవంగా నిర్వహించాలని దువ్వాడ జంట ప్లాన్ చేసుకుని ఉంటారనే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి దువ్వాడ దంపతుల పార్టీ ఇప్పుడు మీడియా లో రచ్చ లేపుతుంది.
