Site icon HashtagU Telugu

KTR : ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాణ్.. అచ్చంపేట ఘటనపై కేటీఆర్ ట్వీట్

Ktr Rahul Gandhi

Ktr Rahul Gandhi

KTR : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళవారం రోజు  బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పం దించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీజీ మీరు చెబుతున్న “మొహబ్బత్ కీ దుకాణ్” (ప్రేమల దుకాణం) ఇదేనా ?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ రాజకీయ ప్రత్యర్థులపై బహిరంగంగా దాడికి తెగబడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం దారుణం. ఈ ఘటనలో పోలీసులు కూడా భాగం కావడం సిగ్గుచేటు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘తెలంగాణ డీజీపీగారు మీరు ఈ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయించకున్నా.. చట్టపరమైన చర్యలు తీసుకోకున్నా.. మేం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.  ఈ ఘటనపై ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్(KTR) ట్యాగ్ చేశారు. 

We’re now on WhatsApp. Click to Join

ఈ ఘటనపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ‘‘ కాంగ్రెస్ నేతలు దాడి చేస్తుంటే స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మీరే  చూడండి డీజీపీ గారు.  ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?’’ అని ప్రశ్నించారు.  మంగళవారం అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కొందరు దుండగులు కర్రలతో దాడి చేసిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ‘‘దీనిపై మేం డీఎస్‌పీ గారితో మాట్లాడితే.. నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కలిసి కనీసం ఒక్క నిందితున్ని కూడా పోలీసు స్టేషనుకు తీసుకరాలేకపోయారు. వాళ్ల మీద చర్య తీసుకోవాలి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలియదా ? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో ప్రశ్నించండి. నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతారు’’ అని తన ట్వీట్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Also Read :PM Modi : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు’’ అంటే ముస్లింలే కాదు.. పేదలు కూడా : మోడీ