Site icon HashtagU Telugu

Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ‌ ప్రభుత్వం భారీ నజరానా!

Telangana Government

Telangana Government

Telangana Government: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం (Telangana Government) రూ. 2,780 కోట్లు మంజూరు చేస్తూ భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టనున్న 2,432 పనులకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధులను తక్షణమే విడుదల చేయనున్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసే ఉద్దేశంతో ఆమోదించిన పనుల కోసం వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ (తెలంగాణ కోర్ అర్బన్ సిటీ)ను మినహాయించి రాష్ట్రంలోని మిగిలిన 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు విడుదల కానున్నాయి.

‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’ లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పట్టణాలను ‘గ్రోత్ హబ్’‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’ పేరుతో ముఖ్యమైన అభివృద్ధి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం నలుమూలల ఉన్న పట్టణాలను ఆర్థిక, అభివృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఈ భారీ నిధులు దోహదపడతాయి.

Also Read: Akhanda 2 Thaandavam: బాలయ్య ‘తాండవం’ స్పెషల్ వీడియో దుమ్ము రేపింది

కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి

ఈ అభివృద్ధి ప్రణాళికలో ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అలాగే కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీలలో చేపట్టే పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా- ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఈ పనులు సకాలంలో పూర్తి కావడానికి పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ భారీ నిధుల విడుదల రాష్ట్ర పట్టణాభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

Exit mobile version