Site icon HashtagU Telugu

IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్‌లదే ఆధిపత్యం !!

Brs Era Ias Officers Ips Officers Telangana Government

IAS Officers :  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ పార్టీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితేనేం గత బీఆర్ఎస్ ​హయాంలో అత్యంత కీలక శాఖలను నడిపిన నలుగురు సీనియర్ ఐఏఎస్‌లకే ఈసారి కూడా ప్రయారిటీ దక్కింది. కోరుకున్న శాఖలే వారికి దక్కాయి. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదనే భావనకు సదరు ఉన్నతాధికారులు వచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఈ భావనతో తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఐఏఎస్‌లు అయితే ఆకస్మాత్తు బదిలీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికి అప్రాధాన్య పోస్టులు దక్కాయి.

Also Read :Saraswati Pushkaram : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం.. సాయంత్రం కాళేశ్వరానికి సీఎం రేవంత్

కీలక శాఖల్లో మార్పు.. ఎందుకు జరగలేదు ? 

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్​ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకటి, రెండు శాఖలు మారినా ఆ అధికారుల మధ్యే ఉండడంతో కాంగ్రెస్ ​ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు.  రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం అనేది పరిపాటి. కానీ తెలంగాణలో కాంగ్రెస్  ​సర్కార్ ఏర్పడిన తర్వాత అలా జరగలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

Also Read :Weight Loss: ఉద‌యం లేచిన వెంట‌నే ఈ ప‌ని చేయండి.. మీ కొవ్వు వెంట‌నే త‌గ్గిపోతుంది!

స్వయంగా సీఎం రేవంత్ ఏం చెప్పారంటే.. 

గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరుగాంచిన ఒక మంత్రి శాఖను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని.. ఇటీవలే బదిలీల్లో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి తీసుకురావడం గమనార్హం. అక్కడ కూడా అదే శాఖకు సంబంధించిన కీలక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయనను హెడ్‌‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది.‘‘గత్యంతరం లేకే సదరు సీనియర్ ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగించాల్సి వస్తోంది. ఇలాంటి అధికారులను బదిలీ చేస్తే ఇబ్బంది అవుతుంది’’ అని  ఇటీవలే స్వయంగా సీఎం రేవంత్ చెప్పారు. దీన్నిబట్టి సదరు సీనియర్ ​ఐఏఎస్‌‌ల కోటరీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఇప్పుడు ఏకంగా సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ పొంది వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

ఇలా ఎందుకు జరిగింది ?