Site icon HashtagU Telugu

Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?

Brs (1)

Brs (1)

ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టిన అగ్ర నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతలకు వరకు వరుసగా రాజీనామా చేస్తూ..కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. ఏ సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో..ఆ క్షణమే కాంగ్రెస్ ఫై ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకమే నేడు ఆయన్ను సీఎం చేయడం జరిగింది.

ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ వస్తుంది. ఎన్నికలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్..ఇప్పుడు ఆ గ్యారెంటీలను వరుసగా అమలు చేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటూ వెళ్తుంది. దీంతో ఇతర పార్టీల నేతలు , ముఖ్యంగా బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే వలసలు కొనసాగాయో..ఇప్పుడు కూడా అలాగే చేరికలు నడుస్తున్నాయి. ప్రతి రోజు ఎవరొకరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప (Koneru Konappa)సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం తన రాజీనామా పత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. గురువారం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కోనప్ప అనుచరులు వెల్లడించారు. కోనప్పతో పాటు ఆయన సోదరుడు, పార్టీ జెడ్పీ ఇన్ చార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. కోనప్ప అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోనప్ప తన సోదరుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును జీర్ణించుకోలేకే కోనప్ప పార్టీని వీడుతున్నారని సమాచారం. కోనప్పతో పాటు జిల్లాలోని ద్వితీయశ్రేణి నేతలు ఎంతమంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనేది సస్పెన్స్ గా మారింది.

వీరు మాత్రమే కాదు మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి తో పాటు పలువురు కీలక నేతలు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వినికిడి. ఇలా వరుసగా నేతలంతా బయటకు వస్తుండడం తో త్వరలో బిఆర్ఎస్ ఖాళీ అవుతుందేమో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : LS Polls : బీఆర్‌ఎస్‌ ఒక్క సీటైన గెలుస్తుందా..?