Hyderabad Real Estate : వచ్చే 6 నెలల్లో హైదరాబాద్‌లో ‘రియల్’ బూమ్.. సంచలన సర్వే నివేదిక

ఈ సర్వేలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ  రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. 

Published By: HashtagU Telugu Desk
Hyderabad Real Estate Telangana Govt

Hyderabad Real Estate : బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పాలనా విధానాలు మారాయి. చాలా పాత వెల్ఫేర్ స్కీంల స్థానంలో కొత్త వెల్ఫేర్ స్కీంలు అందుబాటులోకి వచ్చాయి. మారిపోయిన ఈ పరిణామాల ప్రభావం హైదరాబాద్ మహానగరంలోని రియల్ ఎస్టేట్‌పై పడిందా? రాబోయే ఆరు నెలల్లో భాగ్యనగరం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి ? అనే దానిపై  నైట్‌ ఫ్రాంక్, నరెడ్కో సంస్థలు నిర్వహించిన సర్వేలలో కీలకమైన అంశాలు వెలుగుచూశాయి. అయితే ఈ సర్వే కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే జరగలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల రియల్ ఎస్టేట్ స్థితిగతులపైనా అధ్యయనం చేశారు. ఆ నివేదికలో మన హైదరాబాద్(Hyderabad Real Estate) గురించి ఏమేం ప్రస్తావించారో ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • ఈ సర్వేలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ  రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.  వారు చెప్పిన సమాచారాన్ని క్రోడీకరించి నగరానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఎంతమేర ఉంది అనే రేటింగును ఇచ్చారు.
  • ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్  72 పాయింట్ల మేర ఫలితాన్ని సాధించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఈ ఇండెక్స్ 65 పాయింట్లకే పరిమితమైంది. అంటే రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ కొంతమేర డౌన్ అయింది.
  •  వాస్తవానికి 65 పాయింట్ల వరకు ఇండెక్స్ ఉన్నా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి పొజిషన్‌లోనే ఉన్నట్టు లెక్క. 50 పాయింట్ల కంటే దిగువకు చేరితే మాత్రం రియల్ ఎస్టేట్ పతనం అవుతోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
  • హైదరాబాద్‌లో ఇప్పటికీ ఇళ్లు, అపార్ట్​మెంట్లు, ఆఫీస్​ స్పేస్​‌లకు మంచి డిమాండ్ ఉందని సర్వే నివేదిక తెలిపింది.
  • హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌పై డెవలపర్లు, భాగస్వాములైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పీఈ ఫండ్స్‌ సానుకూలంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ఫ్యూచర్ ఇలా.. 

వచ్చే 6 నెలల్లో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు మరింత పెరుగుతాయని బిల్డర్లు తెలిపినట్లు నివేదిక పేర్కొంది.  సర్వేలో పాల్గొన్న బిల్డర్లలో 63 శాతం మంది ఈ అభిప్రాయాన్నే చెప్పారని తెలిపింది. ధరలు నిలకడగానే ఉంటాయని 36 శాతం మంది తెలిపినట్లు నివేదిక ప్రస్తావించింది. కేవలం 1 శాతం మంది బిల్డర్లు రేట్లు  తగ్గుతాయని చెప్పినట్లు వెల్లడించింది. రియల్ ఎస్టేట్ సేల్స్ పెరుగుతాయని 51 శాతం మంది చెప్పారు.

Also Read :Pakistan : ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి

  Last Updated: 21 Aug 2024, 12:17 PM IST