BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకం తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం గ్రామీణ రైతులు వ్యవసాయపరంగా ఎంతగానో లబ్ధి పొందతున్నారు. వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పనిముట్ల ఈ పథకం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అందుకే పథకం సూపర్ హిట్ అయ్యింది. దీంతో మోడీ ప్రభుత్వం కూడా ‘పీఎం కిసాన్’ రూపంలో రైతులకు డబ్బులిస్తోంది. అయితే రైతు బంధు (Rythu Bandhu) పథకంలో అనేక లొసుగులు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి 600 ఎకరాలు కలిగి ఉంటే, తెలంగాణ ప్రభుత్వం అందించే 5000 రూపాయలు ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రెండు సార్లు డబ్బులు పడుతున్నాయి. అలాగే ఈ స్కీమ్ ద్వారా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రైతు బంధు (Rythu Bandhu) డబ్బును పొందుతున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున (Akkineni Nagarjuna) అక్కినేనికి కూడా ‘రైతుబంధు’ వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ.. అమెరికాలో 30 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు. అతనికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి.
రైతు బంధు (Rythu Bandhu) డబ్బు అతని ఖాతాలో జమ అవుతుంది. హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందారు. ధనవంతులకు, మంత్రులకు అవసరమా? అని ప్రశ్నించారు. దీనికి బదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి” అని మురళి అన్నారు. అయితే నాగార్జునకు ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను మురళి చెప్పలేదు. ‘‘ధనవంతులైన రైతులకు కాకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం అందించాలి’’ అనే వాదన తెలంగాణలో మొదలవుతోంది.
Also Read: Kamareddy Incident: వేటకు వెళ్లి, గుహలో ఇరుక్కుని.. ఓ యువకుడి నరకయాతన