KCR National: కేసీఆర్ కొత్త జాతీయపార్టీ పెడుతున్నారా? పీకే ఇచ్చిన సలహా ఏమిటి?

ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమిటి? ఓవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో డిస్కషన్స్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 25, 2022 / 09:00 AM IST

ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమిటి? ఓవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో డిస్కషన్స్ చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటప్పుడు ఆయన వ్యూహమేంటి? ఒకేసారి రెండు పార్టీలతో కలిసి ఎలా పనిచేయాలనుకుంటున్నారు?

బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి కాంగ్రెస్ తో కలిపి.. వచ్చే ఎన్నికల్లో హస్తవాసి సూపర్ అనేలా చేయాలన్నది పీకే ప్లాన్. కానీ కేసీఆర్ మాత్రం.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో సమదూరం పాటిస్తామని చెప్పడంతో.. టీఆర్ఎస్ లేకపోయినా.. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యమేనని ఆయన చెప్పడం దేనికి సంకేతం? తాను కాంగ్రెస్ లో చేరినా.. టీఆర్ఎస్ కు తన సంస్థ అయిన ఐప్యాక్ సేవలు అందిస్తుందని చెప్పడం వెనుక మర్మమేంటి?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వస్తే టెన్షన్ పోతుంది అనుకుంటారు ఎవరైనా. టీఆర్ఎస్ అదే భావనలో ఉన్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమందికి మాత్రం టెన్షన్ పెరిగింది. ఎందుకంటే… వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చాలని ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలు, ఎమ్మెల్యేల స్థితిగతులు… ప్రత్యర్థుల బలాబలాలు అన్నింటిపైనా కేసీఆర్ కు సమగ్ర నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

ఒకవేళ పీకే కాని కాంగ్రెస్ లో చేరితే.. ఆయన సంస్థ అయిన ఐప్యాక్ ను స్వతంత్ర సంస్థగా మార్చాలని.. లేదంటే దాని సేవలు పొందే పార్టీలన్నీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసినట్టుగా ప్రజలు భావిస్తారని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలతో కలవడం ఇష్టం లేకపోతే.. కేసీఆర్ నేతృత్వంలో కొత్త జాతీయ పార్టీ పెట్టే అంశంపైనా వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో కేసీఆర్ అన్ని రాజకీయ పక్షాలతోనూ సమావేశమవుతున్నారు. జాతీయ రాజకీయాలను మార్చాల్సిన పరిస్థితి ఉందని పదే పదే చెబుతున్నారు. దీంతో ఆయన కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నారా అన్న టాక్ కూడా ఉంది.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని.. అది ఏ విధంగా జరుగుతోందనే దానిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల్లో ముందుకెళితే విజయం తథ్యమని పీకే చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించి.. వారిని మరో పార్టీలోకి వెళ్లేలా చేస్తున్నారని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో త్రిముఖపోరు వల్ల ప్రభుత్వ వ్య