KCR Avoid Murmu: ముర్ము పర్యటనకూ ‘కేసీఆర్’ దూరమేనా!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ముర్ము పర్యటనకు సైతం దూరంగా ఉంటున్నారు.

  • Written By:
  • Updated On - December 17, 2022 / 04:23 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR), ప్రధాని నరేంద్ర మోడీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రాజకీయకంగా వీరిద్దరు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని హోదాలో మోడీ తెలంగాణలో పర్యటించినప్పుడల్లా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో మంత్రి తలసాని స్వాగతం పలికిన సందర్భాలున్నాయి. అయితే నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) డిసెంబర్ 26న తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పటికీ తెలంగాణ (Telangana)లో ప్రచారం చేయలేదు. జులై 12న ఆమె హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా ఆ యాత్ర రద్దయింది. కేసీఆర్ (CM KCR) ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. జులై 2న సినాకు మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. తాజాగా ముర్ము తెలంగాణ టూరు దాదాపు ఖాయమవుతోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ బీఆర్‌ఎస్ (BRS) విస్త‌ర‌ణ ప‌థ‌కాల‌పై దృష్టి పెట్టేందుకు సీఎం డిసెంబ‌ర్ 26 నుంచి ఐదు రోజుల పాటు ఢిల్లీకి ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రపతి (President Tour) పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఐదు రోజుల పర్యటనలో ముర్ము రామప్ప, భద్రాచలం ఆలయాలను సందర్శించి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ రామచంద్ర మిషన్ ద్వారా ఫతేపూర్‌లోని శ్రీరామచంద్రాజీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాల స్మారకార్థం రంగారెడ్డి జిల్లా కానా శాంతి వనం వద్ద హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకాన్ని ఆవిష్కరించడంలో కూడా పాల్గొంటారు.

రాష్ట్రపతి (President) పర్యటనకు సహకరించి సిద్ధం చేయాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం, బొలారం వద్దకు రాకపోకలు సాఫీగా సాగేలా రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్‌లు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోలను ఆదేశించారు. బందోబస్త్ ఏర్పాట్లను పోలీసు శాఖకు అప్పగించారు. 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య శాఖ, ఇతర శాఖలు రాష్ట్రపతి నిలయం (President Bhavan)లో ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ (DGP) ఎం.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Also Read: Teenager Gives Birth: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్, ఘటనపై దళిత సంఘాలు ఫైర్!