తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాజాగా తన పాలనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చారు. కొందరు తన పరిపాలనపై పట్టు లేదని అంటున్నారని, కానీ అధికారుల తొలగింపు, బదిలీలే పరిపాలనలో పట్టు సాధించడం కాదని స్పష్టం చేశారు. ‘క్యాబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనే పాలనలో పట్టు ఉన్నట్లు కాదు. అన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించడమే ముఖ్యమైనది’ అని ఆయన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించడం, పాలనను సరైన దిశలో తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.
Comfortable Bikes: ఈ బైక్‌లలో అత్యంత సౌకర్యవంతమైన సీట్లు.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే!
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంలో 55,000 ఉద్యోగ నియామకాలను చేపట్టి చరిత్ర సృష్టించిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని గర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ, ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఇప్పటికే రూ. 5,000 కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల ఇళ్లలో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 43 లక్షల కుటుంబాలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధి కల్పిస్తున్నామని తెలిపారు.
AP Cabinet : ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
ప్రజలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కోటి 30 లక్షల చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పాలనలో పారదర్శకత పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా, పాలనపై తన పూర్తి పట్టును నిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.