జీవితంలో ప్రభుత్వ కొలువు వస్తే ఇక వెనక్కు చూసుకోవాల్సిన పనిలేదని ప్రతి ఒక్కరు భావిస్తారు. ప్రభుత్వ కొలువు ఉంటె ప్రాణానికి గ్యారెంటీ అని నమ్మేవారు కూడా ఉన్నారు. అందుకే ఎంత పోటీ ఉన్న నిద్రాహారాలు మానుకొని ప్రభుత్వ కొలువు సంపాదించుకునేందుకు కష్టపడుతుంటారు. అలాంటి ప్రభుత్వ కొలువును..రాజకీయాల కోసం వదులుకునేందుకు సిద్ధం పడ్డ వ్యక్తుల గురించి ఇప్పుడు అంత చర్చిస్తున్నారు.
త్వరలోనే కరీంనగర్-మెదక్-నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టాభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు ఇప్పటి నుంచే తమ పొలిటికల్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలలోని ఆశావాహులు టికెట్ కోసం ఇప్పటి నుంచే మంతనాలు మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం అవుతుండం రాజకీయంగా చర్చ గా మారింది. ప్రజలకు సేవ చేయాలనో..లేక జీవితంలో ఒక్కసారైనా పొలిటికల్ లీడర్ కావాలనో..లేక రాజకీయాల్లో బాగా సంపాదించుకోవచ్చనే ఆశతో కారణం ఏంటో కానీ రాజకీయాల్లో దిగేందుకు తమ సర్వీసును వదులుకుంటున్నారు. వారు ఎవరా అనుకుంటున్నారా..?
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన పులి ప్రసన్న హరికృష్ణ (Puli Harikrishna), డీఎస్పీ ఉద్యోగాని రిజైన్ చేసిన మదనం గంగాధర్ (DSP Gangadhar). ఈ ఇద్దరు ఇప్పుడు MLC ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన పులి ప్రసన్న హరికృష్ణ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన గంగాధర్ అత్యంత నిరుపేద కుటంబంలో జన్మించారు. 22 ఏళ్లకే తొలి ప్రయత్నంలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన గంగాధర్ పొలిస్ టు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విధి నిర్వాహణలో దాదాపు 200 రివార్డులను గంగాధర్ అందుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్ లీక్ కేసు విచారణలోనూ ఆయన పాల్గొన్నారు. ఇన్నాళ్లు పోలీస్ గా సేవలందించిన గంగాధర్ ఇక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. మరి వీరు ఏ పార్టీలో చేరతారు..? ప్రభుత్వ పదవులు వదులుకొని రాజకీయాల్లో విజయం సాదించగలరా..? ప్రజలు వీరిని గెలిపిస్తారా..? లేదా..? అనేది చూడాలి.
Read Also : New Traffic Rules : హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్