Site icon HashtagU Telugu

Eatala Rajender: హుజూరాబాద్ గడ్డా.. ఈటల అడ్డా!

Etala

Etala

ఈటల రాజేందర్.. (Eatala Rajender) తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు తెలియనవారు ఉండరు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ అసలైన లీడర్ అని నిరూపించుకున్నారు. పట్టుదల, అంకితభావం, కష్టపడే తత్వం లాంటి లక్షణాలు ఎదురులేని నాయకుడిగా ఎదిగేలా చేశాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రాష్ట్ర మంత్రిగా పనిచేసినా నమ్ముకున్న నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదు. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయనకు పట్టం కడుతుంటారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా (BJP MLA) పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్నట ఈటల గురించి స్పెషల్ ఫోకస్..

విద్యార్థి నాయకుడిగా..

మొదట్నుంచీ ఈటల రాజేందర్ ది ఉద్యమపంథా. అందుకే విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై కేసీఆర్ తో కలిశారు. తెలంగాణ ఉద్యమంతో తనవంతు పాత్ర పోషించారు. ఎక్కవ సమయం ఉద్యమానికే టైం కేటాయిస్తుండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌.. ఈ ఏడేళ్లల్లో పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందరే. అయితే, ఇలా రాజీనామా చేయ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో.. ప్ర‌త్యేక రాష్ట్ర సాద‌న కోసం రెండుసార్లు ఇలానే ఎమ్మెల్యే పోస్ట్‌కు రాజీనామా చేశారు. స్వ‌రాష్ట్రంలో ప‌ద‌వి వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌తో విభేదించి.. బానిస భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లుకొట్ట‌డానికంటూ.. గ‌డీల పాల‌న‌కు వ్య‌తిరేకంగా.. కేసీఆర్ (CM KCR) పై రాజీనామా అస్త్రాన్ని సంధించిన ఉద్య‌మ నాయ‌కుడు కూడా.

ప్రజాబలంతో

ఆనాడు ఉద్య‌మాన్ని ఉర‌క‌లు ఎత్తించ‌డానికి రాజీనామాను బ్ర‌హ్మాస్త్రంగా ప్ర‌యోగిస్తే.. ఆ తర్వాత హుజురాబాద్ కేంద్రంగా మ‌రో ప్ర‌జా ఉద్య‌మానికి శ్రీకారం చుట్టేందుకు రాజీనామా చేశాడు. గ‌తంలోనూ ఆయ‌న రెండుసార్లు ఇలానే రాజీనామా చేసి.. గెలుపొందారు మ‌రి. మూడోసారి కూడా చ‌రిత్ర రిపీట్ ను ఎదురు లేని నాయకుడిగా నిలిచాడు. 2004లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా క‌మ‌లాపూర్‌లో పోటీ చేసి.. మాజీ మంత్రి ముద్ద‌సాని దామోద‌ర్‌రెడ్డిని ఓడించి త‌న ఉనికిని బ‌లంగా చాటుతూ.. ఘ‌నంగా అసెంబ్లీ ప్ర‌స్తానం ప్రారంభించారు ఈట‌ల రాజేంద‌ర్‌. 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్‌ కేంద్రంగా కొత్తగా నియోజకవర్గం ఏర్పడింది. ఉద్య‌మంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేర‌కు.. 2008, 2010లో ఎమ్మెల్యే ప‌ద‌వికి (Resign) రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించి.. అసెంబ్లీలో ప్ర‌త్యేక రాష్ట్ర ప్ర‌కంప‌ణ‌లు తీసుకొచ్చారు.

ఆ తర్వాత గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలోనూ ఈటల తిరుగు లేని మెజార్టీ గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. కేసీఆర్ సర్కార్ వేల కోట్లు డబ్బు కుమ్మరించినా, సొంత పార్టీల నేతలను ఇబ్బందులు పెట్టినా అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు. ఈటల బలాన్ని గమనించిన కేసీఆర్ సర్కార్ వచ్చే ఎన్నికలోనైనా ఓడించాలని సర్వశక్తులు ప్రయోగిస్తోంది. ఇప్పట్నుంచే హుజురాబాద్ లో పాడి కౌశిక్ ను బరిలో దించి పావులు కదుపుతోంది. అయితే హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే ఉంటారనే విషయం చాలాసార్లు స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లోనూ (Election 2023) ఈటల గెలుస్తారు అని అక్కడి ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫ్రొఫైల్ (Profile)

జననం: 1964 మార్చి 20
గ్రామం: క‌మ‌లాపూర్‌ కరీంనగర్
భార్య: ఇ. జ‌మున
సంతానం: నితిన్ రెడ్డి , నీతా రెడ్డి
నివాసం: శామీర్‌పేట్, హైదరాబాద్
ప్రస్తుత హోదా: బీజేపీ ఎమ్మెల్యే

Also Read: Telangana Elections: బీజేపీ బిగ్ స్కెచ్.. జూన్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు!