Site icon HashtagU Telugu

Khammam: BRS కు ఖమ్మం భయం పట్టుకుందా?

Is Brs Afraid Of Khammam

Is Brs Afraid Of Khammam

Khammam fear to BRS : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజీపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒకతాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజకీయంగా లబ్ది పొందింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అన్నది ప్రధాన విమర్శ. దాంతో ఆశావహులు సీఎం కెసిఆర్ పై పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించే అవకాశం కోసం అసంతృప్తి నేతలు ఎప్పటినుంకో ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే వారికి సరైన ఫ్లాట్ ఫార్మ్ లేక ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మారింది. బడా నేతల అండదండలతో కెసిఆర్ పై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

తెలంగాణాలో కొత్త పార్టీ అవతరించబోతుంది. ఖమ్మం (Khammam) వేదికగా త్వరలోనే కొన్ని ఆసక్తికర ప్రకటనలు వెలువడబోతున్నాయి. దీనికి అద్దం పట్టే విధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇక ఈ కార్యక్రమంలో పొంగులేటి రాజకీయ హింట్లు కూడా ఇచ్చారు. త్వరలో తెలంగాణ రాజకీయంలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నట్టు సంచలన కామెంట్స్ చేశారు.

రెండు నెలల్లో కెసిఆర్ పాలనని వ్యతిరేకించే వారంతా ఒక తాటిపైకి వస్తారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కారణంగా రాజకీయంగా ఎంతో మంది నష్టపోయారని, ఆయా నియోజకవర్గాల్లో సదరు నేతలు మొహం కూడా చూపించుకోలేని పరిస్థితిని కెసిఆర్ కల్పించారని ధ్వజమెత్తారు. అయితే వారంతా తమ అసంతృప్తిని బయటపెట్టలేక తమలో తాము నరకం అనుభంచారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో అందరూ ఒకతాటిపైకి వచ్చి పోరాటం చెయ్యాలని పొంగులేటి పిలుపునిచ్చారు.

ఖమ్మం (Khammam) వ్యాప్తంగా ఇప్పటికీ పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్న తన అనుచరులతో రాజీనామాలు చేయించాడు. కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా తన అనుచరులను ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. ఇదంతా కొత్త పార్టీ పెట్టేందుకేనని రాజకీయంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పొంగులేటి ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు ఈ మూడు నియోజవర్గాలలో ఒక నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నాడు.

ఇటీవల కొత్తగూడెంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సభ కెసిఆర్ కి తలనొప్పిగా మారింది. ఆ సభలో పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కెసిఆర్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. సొంత పార్టీ నేతలో ఇలా కామెంట్స్ చేయడంతో బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకున్నంత పనైంది. పార్టీ వర్గాల్లో కొందరు ఇదే మాట్లాడుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఖమ్మం రాజకీయం హీటెక్కడానికి ఇదే నిదర్శనం.

Also Read:  Jagan AP CM: రామ రామ! జగన్ మడమ నొప్పికి మతం ముసుగు..

Exit mobile version