BJP: తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది!

తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని, రానున్నది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 11:46 AM IST

తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని, రానున్నది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ని పడగొట్టి అధికారంలోకి రావడం బీజేపీతో అయ్యే పనికాదు కానీ, మెల్లిమెల్లిగా బీజేపీ తన గ్రాఫ్ పెంచుకుంటోంది.

2014లో శాసనసభలో ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ వంద స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అయితే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచి అందరికి షాక్ ఇచ్చింది.

Also Read: ఆ గ్రామాల్లో జనం వలస బాట

తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి అతి తక్కువ మెజారిటీ తో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ చరిత్రలో ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అదే మొదటిసారి. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన స్థానాలు గెలుపొంది మరోసారి బీజేపీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నాగార్జున సాగర్ ఉప్క్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని బీజేపీ హుజురాబాద్ ఉపఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించింది. అయితే వీటిల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం మాత్రమే పార్టీకి క్రెడిట్ ఇవ్వాలి. మిగతా విజయాల్లో అభ్యర్థుల విజయంగా చూడాలి.

Also Read: చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులను చూస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అధికారాన్ని ఇచ్చారు. ఇక సహజంగానే ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. అయితే ఆ పరిస్థితిని క్యాచ్ చేసుకొనే స్థితిలో ప్రతిపక్షాలు లేవనే చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా టీఆర్ఏస్సే నయమనుకునే న్యూట్రల్ ఓటర్లను కూడా కేసిఆర్ తన పద్ధతులవల్ల బీజేపీకి అనుకూలంగా మార్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హాట్ హాట్ కామెంట్స్ చేసుకుంటున్న రెండు పార్టీల్లో రానున్న కాలంలో ప్రజలు ఎవరివైపు ఉంటారో చూడాలి.