Site icon HashtagU Telugu

Old City Metro: పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకుంది ఎవరు?

Old City Metro

New Web Story Copy 2023 06 22t155157.916

Old City Metro: హైదరాబాద్ లో మెట్రో రాకతో నగరం మరింత అభివృద్ధి పథంలో దోసుకెళ్తుంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరం అయింది. దీంతో నగర ప్రజలు ఎక్కడినుంచి ఎక్కడికైనా సులభంగా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఇక్కట్లు తీరినట్టైంది. అయితే నగరంలోని అన్ని ప్రధాన ఏరియాలకు మెట్రో సౌకర్యం ఉన్నప్పటికీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి ఇంకా ఆ సౌకర్యం రాకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాతబస్తీలో అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్న నేపథ్యంలో రోజు వేలాది మంది ప్రజలు పాతబస్తీని సందర్శిస్తుంటారు. అయినప్పటికీ ఆ ప్రాంతానికి మెట్రో అమలు చేయలేదు.

పాతబస్తీకి మెట్రో రాకపోవడానికి ఎంఐఎం కారణమని ఆరోపించారు సిపిఐ నేతలు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నరసింహ మాట్లాడుతూ.. పాతబస్తీ మెట్రో నిర్మాణానికి ప్రధానంగా ఎఐఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. ఎంఐఎం ఆ ప్రాంతాన్ని పాలించేంత వరకు పాతబస్తీకి మెట్రో రైళ్లు రావని ప్రజలు తెలుసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాతబస్తీలోని యువత హైటెక్ సిటీలో ఉపాధి పొందలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు సిపిఐ నేత నరసింహ. ఎంఐఎం నేతల హామీలను నెరవేర్చకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నగరమంతటా విస్తరించిన మెట్రో, ఓల్డ్ సిటీకి రావాలని ఆ పార్టీ నేతలు కోరుకోవడం లేదన్నారు.

Read More: Care Hospitals: 80 ఏళ్ల రోగికి అరుదైన వెన్నముక శస్త్ర చికిత్స.. చివరికి?