హైడ్రా (Hydra) అధికారులు భారీ అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే చెప్పాలి. హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.
సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. హైడ్రా స్పీడ్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇతర రాజకీయ నేతలు సైతం హైడ్రా దూకుడు పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ , సినీ ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..ఇక ఇప్పుడు కేటీఆర్ దే అని చెప్పబడుతున్న జన్వాడ ఫాంహౌస్ ను కూల్చేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాంహౌస్ లోకి ఎంటరయ్యారు. ఫాంహౌస్ కొలతలను తీసుకుంటున్నారు. ఏ నిముషంలో అయినా కూల్చివేతలు మొదలు కావచ్చని సమాచారం. ఉస్మాన్ సాగర్ లేక్ పరిధిలోని ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిమితులను ఉల్లంఘించి ఫాంహౌస్ ను నిర్మించుకున్నారని చాలాకాలంగా కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. అయితే 2014 నుండి 2023వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నకారణంగా అందులోకి వెళ్ళటానికి ఎవరికీ అనుమతి దక్కలేదు. ఎప్పుడైతే అక్రమనిర్మాణాలను హైడ్రా కూల్చటం మొదలుపెట్టిందో వెంటనే జన్వాడ ఫాంహౌస్ జోలికి రాకుండా బిల్డర్ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి జన్వాడ ఫాం హౌస్ మీదకు మళ్ళింది.
ఎందుకంటే అప్పటివరకు ఫాంహౌస్ కేటీఆర్ దే అని అనుకుంటున్నారు. అలాంటిది సడెన్ గా ప్రదీప్ రెడ్డి కేసు వేయటంతో అందరిలోను అయోమయం మొదలైంది. దీనికి తగ్గట్లుగానే కేటీఆర్ స్పందిస్తు ఫాంహౌస్ తనది కాదని తన మిత్రుడి దగ్గర నుండి లీజుకు తీసుకున్నట్లు వివరించారు. ఫాంహౌస్ తనది కానపుడు మరి గతంలో రేవంత్ రెడ్డి తదితరులమీద కేటీఆర్ ఎందుకు ఫిర్యాదుచేసి అరెస్టు చేయించారన్న బీజేపీ ఎంపీ రఘునందనరావు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇదే సమయంలో బుల్కాపూర్ నాలాను ఆక్రమించి కట్టుకున్న ఫాంహౌస్ అని తెలిసీ కేటీఆర్ పదేళ్ళుగా అందులో ఎలా ఉంటున్నారంటు మంత్రులు దాడులు మొదలుపెట్టారు. ప్రస్తుతం మాత్రం హైడ్రా అధికారులు జన్వాడ ఫాం హౌస్ లోకి ఎంట్రీ కావడం తో ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఫాం హౌస్ ను కూల్చడం ఖాయమని తెలుస్తుంది. ఇదే క్రమంలో మరికొంతమంది మరో విధంగా మాట్లాడుకుంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కు బెయిల్ వచ్చింది. రేపు ఆమె హైదరాబాద్ కు రాబోతున్నారు. దీంతో మీడియా కవరేజ్ మొత్తం కవిత వైపు వెళ్తుంది కాబట్టి..దానికంటే ముందే ఫాం హౌస్ ను కూల్చివేత పనులు మొదలుపెడితే మీడియా కవిత వైపు చూడదనే నేపథ్యంలో హైడ్రా దూకుడు చూపిస్తున్నారని అంటున్నారు. మరి రేపు ఏంజరుగుతుందో చూడాలి.
Irrigation officials at Janwada farmhouse leased by KTR pic.twitter.com/nDYwTxt1v0
— Naveena (@TheNaveena) August 27, 2024
Read Also : AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ భేటీ