Telangana Formation Day : గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS

ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ..ఇదేనా అమరవీరులకు మీరు ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతుంది.

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 10:24 AM IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దశాబ్ధి వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈ ఏర్పాట్లు చేయబోతున్నట్లు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెపుతుంది. ఈ వేడుకలకు రావాల్సిందిగా సోనియా తో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు అలాగే పలువురుకు ఆహ్వానాలు పంపింది. ఇదే తరుణంలో గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచె వేయడం ఫై బిఆర్ఎస్ పార్టీ విమర్శలు కురిపిస్తుంది. జూన్‌ 2న జరుగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరుల స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే.. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ..ఇదేనా అమరవీరులకు మీరు ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈరోజు శనివారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే రేపు తెలంగాణభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పటు చేసి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు గత పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని పలు దవాఖానలు, అనాథ శరణాలయాల్లోని వారికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు.

Read Also : Form 26AS: మీ ద‌గ్గ‌ర ఫారమ్ 16 లేదా అయితే ఈ ఫార‌మ్‌తో ఐటీఆర్ ఫైల్ చేయండి..!