సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను (IPS Officer Naveen Kumar) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Retired IAS Officer Bhanwar Lal) ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అదుపులో తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఖండించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నవీన్ కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని కోరాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విదులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్.. అద్దెకు ఉంటోన్న భవనాన్ని చేజిక్కించుకోడానికి కుట్రలు చేసినట్టు ఫిర్యాదు అందడంతో కేసు నమోదయ్యాయింది. ఈ కేసులో రెండు రోజుల కిందట ఐపీఎస్ అధికారి భార్యను అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లను రూపొందించిడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఓర్సు సాంబశివరావు, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, ఆయన భార్య రూపా డింపుల్‌ను నిందితులుగా చేర్చారు. 2014లో జూబ్లిహిల్స్‌లో ని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లు రెంటల్ అగ్రిమెంట్ చేశామని భన్వర్ లాల్ భార్య మనిలాల్ ఫిర్యాదులోపేర్కొన్నారు. 2019 లో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంటిని ఖాళీ చేయమన్నామని, రెంటల్ అగ్రిమెంట్‌కు విరుద్దంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. నకీలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని అక్రమంగ కబ్జా చేయాలని చూస్తున్నారని భన్వర్ లాల్ సతీమణి ఆరోపించారు.
Read Also : Ayodhya: రామ మందిర నిర్మాణానికి అదనంగా 500 మంది కూలీలు