Site icon HashtagU Telugu

Telangana: బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

Telangana

Telangana

Telangana: నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అందజేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు ఆలయ విశేషాలను వివరించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 15న స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్య వచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడ ముద్ద, భేరీపూజ, దేవతాహ్వానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 17న సాయంత్రం శ్రీ గోదా రంగనాథ స్వామి తిరు కల్యాణం, రహోత్సవం జరుగుతాయని, జూన్ 18న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, దేవతోద్వాసనం, ద్వాదశారాధన, ధ్వజ అవరోహణం, కుంభ ప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పురాతన ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు టివి మురళీధరాచార్యులు, వస్తల శ్రీధర్ రెడ్డి, సునీల్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఉన్నారు. మల్లికార్జున్, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Chandrababu : రేపు సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు..ఆ మూడు ఫైల్స్ సంతకం

Exit mobile version