KCR: మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం

  • Written By:
  • Updated On - June 8, 2024 / 10:33 PM IST

KCR: రేపు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కి ఆహ్వానం అందింది. మాజీ కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు ప్రహ్లాద్ జోషి గారు కెసిఆర్ గారికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా ఈ ఆహ్వానం అందించారు. రేపు ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఉద్య‌మ పార్టీగా పేరున్న బీఆర్ ఎస్ పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన విష‌యం మరువ‌క‌ముందే ఆ పార్టీకి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 17 స్థానాల్లో కూడా ఏ ఒక్క సీటు గెల‌వ‌లేక‌పోయింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యంతో గెలిచి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నుకున్న కేసీఆర్ కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. అయితే కేసీఆర్ బ‌దులు నారా చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ కేంద్రంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం