Investments In Telangana: తెలంగాణలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం నాడు కౌలాంలపూర్ లో అక్కడి పారిశ్రమికవేత్తలతో (Investments In Telangana) సమావేశమయ్యారు. స్థానిక తెలంగాణా ఎన్నారైలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పారిశ్రమిక వేత్తలకు పిలుపునిచ్చారు.
మలేషియా- భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. పెట్టుబడులతో తమ దేశానికి వచ్చే వారందరికి హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ గా ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. డిసెంబరులోగా తెలంగాణ సందర్శించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని మలేషియా పారిశ్రామిక వేత్తలకు ఆహ్వనం పలికారు.
Also Read: Health Insurance: 5 లక్షల ఉచిత బీమా పొందడం ఎలా? దరఖాస్తు ప్రక్రియ ఇదే!
రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు
అనూహ్య పరిస్థితుల్లో ప్రజాసేవలోకి వచ్చిన తాను ప్రజా ప్రతినిధిగా నవంబరు 10తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం ఇక్కడి మిత్రులు చెప్పేదాక తనకు గుర్తు లేదని అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పార్టీలో ఎంతో ప్రాధాన్యతనిచ్చి తనను ప్రోత్సహిస్తూ వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల, మల్లిఖార్జున్ ఖర్గేలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా నలుగురు ముఖ్యమంత్రులతో పని చేశానని, వారంతా తన పట్ల ఎంతో అభిమానం కనబర్చారని తెలిపారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న సహచరులకు, తన వెంట నిలిచిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.