BRS Party: అప్పు ప్రతీసారీ తప్పు కాదు, కాంగ్రెస్ శ్వేతపత్రంపై BRS రియాక్షన్

అప్పు ప్రతిసారి తప్పు కాదు అని, తెచ్చిన రుణాలతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అనంతమని తేల్చి చెప్పింది. 

  • Written By:
  • Updated On - December 20, 2023 / 04:12 PM IST

BRS Party: ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. బీఆర్ఎస్ హాయంలో జరిగిన అభివ్రుద్ధి, ప్రాజెక్టులు తీరు, లోపాలపై తెలంగాణ కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేశారు. తెలంగాణ మొత్తం అప్పులు 72,658 కోట్లు ఉన్నట్టు తేల్చి చెప్పారు. ఈ వ్యవహరంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అప్పు ప్రతిసారి తప్పు కాదు అని, తెచ్చిన రుణాలతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అనంతమని తేల్చి చెప్పింది.

పూర్తి వివరాలు

🔷 బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది అంటూ కొందరు అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

🔷 తీసుకున్న రుణాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికే ఉపయోగించింది తప్ప దుబారాగా ఖర్చు చేయలేదు. వివిధ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెరుగైన వైద్య సదుపాయాలు, మెడికల్ కాలేజీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, విద్యుత్ సంస్థల బలోపేతం, రోడ్లు, ఫ్లైఓవర్లు, మార్కెట్లు మొదలగు వాటికోసమే ఉపయోగించింది.

✅ నిజానికి ఉత్పాదక రంగాల్లో (ప్రొడక్టీవ్ సెక్టర్) పెట్టే పెట్టుబడులను అప్పు అని అనొద్దు.. అవి బంగారు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు మాత్రమే.

👉 ఉదాహరణకి లక్ష రూపాయలు సంపాదించే ఒక వ్యక్తికి తన జీతానికంటే సుమారు 50 రెట్లు అంటే 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకులు వెనకాడవు. అంటే మనం తిరిగికడతాం అనే నమ్మకం ఉంటేనే మనకు అప్పు పుడుతుంది.

👉 ఒక రాష్ట్రం విషయంలోనూ అంతే… ₹1.26 లక్షల కోట్లతో స్వంత ఆదాయంలో దేశంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం… ఇంత రాబడి ఉన్న రాష్ట్రానికి రూ. 3-4 లక్షల కోట్ల అప్పు ఉండటం ఏ మాత్రం తప్పు కాదు.. ఆర్థిక వ్యవస్థకు హానికరం కాదు.

👉 ఎలాగైతే ఒక మనిషి ఎదుగుదలకి ఫార్మేటివ్ ఇయర్స్ ఎంత ముఖ్యమో.. ఆ సమయంలో పోషకాహారం అందించడానికి ఎలాగైతే కృషి చేస్తామో.. ఒక కొత్త రాష్ట్రం విషయంలోనూ అంతే…

👉 తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రానికి.. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం ఎదుగుతున్న ఇలాంటి సమయమే సరైన సమయం. అందుకే ప్రతీ రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసింది.

📊 ఇప్పుడు అంకెల్లోకి వద్దాం.. ఏదైనా రాష్ట్రం యొక్క అప్పుల స్థితిగతులను తెలియచేయడానికి జీఎస్డీపీలో అప్పుల శాతాన్ని (డెట్ టూ జీఎస్డీపీ రేషియో) ప్రామాణికంగా తీసుకుంటారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 24వ స్థానంలో ఉంది.. అంటే మనకంటే జీఎస్డీపీలో అప్పుల శాతం ఎక్కువున్న రాష్ట్రాలు 23 ఉన్నాయి.

✔️తెలంగాణ డెట్ టూ జీఎస్డీపీ రేషియో – 26.80%

మనకంటే ఎక్కువ అప్పులు చేసిన 23 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు👇

💰 పశ్చిమ బెంగాల్ – 38.50%
💰 కేరళ – 37.20%
💰 గుజరాత్ – 35.50%
💰 రాజస్థాన్ – 35.30%
💰 ఆంధ్రప్రదేశ్ – 32.50%
💰 తమిళనాడు – 31.40%