HCU Lands Issue : గచ్చిబౌలి భూములపై విచారణ ..ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Investigation into Gachibowli lands..High Court notices to respondents

Investigation into Gachibowli lands..High Court notices to respondents

HCU Lands Issue : తెలంగాణ హైకోర్టు వివాదాస్పద కంచ గచ్చబౌలి భూములపై విచారణను వేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కౌంటర్, రిపోర్ట్ ఈ నెల 24లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24కు పిటిషన్ల విచారణకు వాయిదా వేసింది. కాగా, కంచ గచ్చిబౌలి భూ వివాదంఫై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆ 400 ఎకరాలలో చెట్ల నరికి వేతపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూములపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీంతో ఏప్రిల్ 24కు 400 ఎకరాల భూములపై దాఖలైన పిటిషన్లను విచారణ వాయిదా వేసింది.

ఇకపోతే.. కంచ గచ్చిబౌలి భూముల ఫేక్ ప్రచారాని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రచారం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఏఐ జనరేటెడ్‌ ఫొటోలు, వీడియోలతో వివాదం ముదిరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం అవగాహనా లేకుండా, మ్యాటర్ తెలుసుకోకుండా కొందరు సెలబ్రిటీలు సైతం అది హెచ్‌సీయూ భూమి అని నమ్మి వీడియోలు చేయడం బాధాకరం అన్నారు. అది ప్రభుత్వం భూమి అని, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం చేపిస్తున్న ఫేక్ ప్రచారంతో వివాదం ముదురుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈవిషయం ఇప్పుడు జాతీయస్థాయికి వెళ్లింది.

Read Also :  Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?

  Last Updated: 07 Apr 2025, 01:16 PM IST